
పయనించే సూర్యుడు మే 24 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాధమిక వ్యవసాయ సహకార ద్వారా రైతులకు పచ్చి రొట్ట, సబ్సిడీ విత్తనాల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు లు హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ తహసిల్దార్ ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్లు,సంబంధిత అధికారులు,మండల అధ్యక్షులు దేవనాయక్, నాయకులు ఈది గణేష్,రెడ్యానాయక్, పోశాలు సంజయ్, లక్కినేని శ్యామ్, ఊళ్ళోజి ఉదయ్,బానోత్ రవి, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.