టైటిల్ ..మచర్ల టౌన్ పల్నాడుజిల్లా పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రాతినిది నాగేంద్రబాబు కాలుకురి నారాయణ లో మాస్టర్ చెఫ్.
పట్టణంలోని స్ధానిక నారాయణ స్కూల్ నందు మాస్టర్ చెఫ్ కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రిపేర్ చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ.
చిన్నారులు ప్రిపేర్ చేసిన అన్ని వంటకాలు బాగున్నాయి అని.
నేటి సమాజంలో చిన్నారులు చైనీస్ ఫుడ్ ( జింక్ ) బాగా అలవాటు పడటం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని.
కావున ప్రతి ఒక్క తల్లితండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు ఇటువంటి జింక్ ఫుడ్ కి దూరంగా ఉంచాలని.
మన సంస్కృతికి సంబంధించిన పిండి వంటకాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో రకాలైన వంటకాలను పిల్లలకు నేర్పించడం వలన చాలా ఉపయోగాలు కలుగుతాయి అని తెలిపారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్దులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,
స్కూల్ ఇన్చార్జి లు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, సునీత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివ కిరణ్ రాజు, తదితర పాఠశాల సిబ్బంది విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.