
జర్నలిస్ట్ కేపీని ప్రశంసలతో ముంచిన మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాంగ్రెస్ నేత జమృద్ ఖాన్..
ఉత్తమ జర్నలిస్టు పురస్కారం నేపథ్యంలో సత్కారం..
కేపీ కుమారుడు రెహమాన్ సెమినార్ ఎంపికపై హర్షం..
జర్నలిస్టులకు నిరంతరం అండగా ఉండాలని విజ్ఞప్తి..
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
అక్షర శోధకుడిగా, అధ్బుతాల సాధకుడిగా, సమాజ సేవకుడిగా, జర్నలిస్టుల నాయకుడిగా కేపి అడుగులు ఆదర్శ వంతమని మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాంగ్రెస్ నేత జమ్రుద్ ఖాన్ ప్రశంసించారు. తెలుగు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఉత్తమ రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి పురస్కారానికి కెపి అవార్డు పొందిన నేపథ్యంలో సోమవారం ఆయన ఇంటికి వెళ్లి ఆయనను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టుదలే ఉంటే మనిషి కాగలడు మరో బ్రహ్మ.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. అన్నమాటకు నూటికి నూరుపాళ్ళు కే పి అర్హుడని వారు పేర్కొన్నారు. అనంతరం కేపి మాట్లాడుతూ నాయకులు, జర్నలిస్టులు అండగా ఉండటం వల్లనే తన నాయకత్వం విజయవంతంగా ముందుకు సాగుతుందని అన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కలాన్ని కదిలించి వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హమాన్ సూపర్..యూరోప్ దేశంలో యూరోపియన్ పార్లమెంట్ లో సెమినార్ కు ఎంపికై అక్కడి సమస్యలపై మాట్లాడి అందరిని అబ్బురపరిచిన కేపీ కుమారుడు మహమ్మద్ రెహమాన్ తీరు అభినందనీయమని మాజీ కౌన్సిలర్ శ్రావణి, కాంగ్రెస్ నేత జమ్రుద్ ఖాన్ అన్నారు. రెహమాన్ తీరును అభినందిస్తూ అతని తరుపున కేపీని మరోసారి సత్కరించారు. రెహమాన్ మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో జామీ సాబ్, సయ్యద్ మసూద్ అలీ, మన్సూర్, సురేష్, సాహెబ్, ఈ న్యూస్ హర్షద్, యూసఫ్, భాస్కర్, మైదునున్న, కాలేజ్ రాజు, అసద్ బాయ్, సైఫ్, అన్వర్, మోల్ సబ్, మహమ్మద్ షాకీర్, గుడిపల్లి బీరప్ప, కుమార్ నాని, అలీ అజ్జు, డాక్టర్ ఇర్ఫాన్, ఎంపీ ఈసా, మహేందర్ భాష, అద్నాన్ కుమార్ అన్న, అలీమ్ షేకబ్, విజయ్, మొయిద్దిన్, మొల్ల షాప్, బాబు, నరసింహ, మధు, మూర్తి, నరేష్, రియాన్, వాజర్, లడ్డు, శంకర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.
