
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 14(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల పరిధిలోని చిక్కేపల్లి , నిట్టూరు తదితర గ్రామాలలో రైతులు మొలకెత్తిన పత్తి పంట సకాలంలో వర్షాలు రాక మరుగుజ్జుగా తయారు కావడంతో చేసేదేమీ లేక ఆ పంటలను దున్నేశారు . సమాచారం తెలుసుకున్న మాజీ జె.డ్పి.టి.సి. వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ సంజీవరాయుడు, వైకాపా నాయకులు కార్యకర్తలు , రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఆయా పొలాలలో రైతులు పెట్టిన పెట్టుబడి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెన్నపూస వెంకటరామిరెడ్డి , చిక్కేపల్లి అశోక్ రెడ్డి సర్పంచ్ , పచ్చార మేకలపల్లి చిన్న వెంకటనాయుడు , రాయలచెరువు రామాంజనేయులు , తూట్రాళ్లపల్లి రామ కృష్ణ రెడ్డి , తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు.
