
లైన్ ఇన్ స్పెక్టర్ ఎల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు గ్రామస్తులు స్పందనకు వందనం
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం చారాల పంచాయతీ కురప్పల్లె గ్రామంలో మెయిన్ రోడ్డు ప్రక్కన సింగల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ మరియు త్రీఫేస్ ట్రాన్స్ ఫార్మర్ లు చాలా క్రిందన అమర్చి ప్రజలకు చాలా ప్రమాదకర స్థితిలో ఉంది అని పయనించే సూర్యుడు దినపత్రికలో ప్రకటన ఇవ్వగా వె ను వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి ప్రమాదకర స్థితిలో ఉన్న వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను విద్యుత్ అధికారులు స్పందించి చాలా క్రిందన అమర్చిన ట్రాన్స్ ఫార్మర్లను ఎత్తులో అమర్చి రైతులకు పశువులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్ తీగల కు బైండింగ్ చేయడం జరిగింది ఈ ప్రమాదకర స్థితిలో ఉన్న వాటిని సరిచేసి నందుకు లైన్ ఇన్ స్పెక్టర్ ఎల్లయ్యకు గ్రామస్తులు రైతులు కృతజ్ఞతలు తెలిపారు