
పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం, పత్రిక స్వేచ్ఛను హరించడం తగదని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్, బనగానపల్లె డివిజన్ అధ్యక్షులు జి సర్వేశ్వర రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సాక్షి దినపత్రికపై రాష్ట్ర ప్రభుత్వం వేధింపులు అక్రమ కేసులకు నిరసనగా ఏపీడబ్ల్యుజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ మంజుల రెడ్డి కి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ పై ,జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. ఐదు రోజులుగా సాక్షి కార్యాలయాలపై విచారణ పేరుతో పోలీసులు గంటల తరబడి సోదాలు చేయడం సమంజసం కాదన్నారు .విచారణ పేరుతో పోలీసులు హైదరాబాద్, నెల్లూరు కార్యాలయాలలో గంటల తరబడి విచారణ చేయడం సమంజసం కాదన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ విధానాన్ని మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ బనగానపల్లె నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆంధ్ర అక్షర రామచంద్రారెడ్డి, సూర్య నరసింహారెడ్డి, కార్యదర్శి స్వతంత్ర న్యూస్ షాషావలి, మండల అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఎం. రఘురామిరెడ్డి , మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బాల చెన్నయ్య, ఉపాధ్యక్షులు నేను సైతం మధు, సూర్య రాజేష్ , జర్నలిస్టులు నగేష్, సుబ్బయ్య, రాజ్ న్యూస్ వేణుగోపాల్, శ్రీకాంత్, నందిధాత్రిక కుమారస్వామి, మనోహర్, వెంకట రాముడు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.