పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం……ఈరోజు శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం 2005 పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005, అమలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాచార హక్కు చట్టం 2005 అనేది పేద ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు.ప్రతి భారత పౌరుడు ఈ చట్టం పైన అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. గ్రామపంచాయతీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ శాఖలలో సమాచార హక్కు చట్టం అమల్లో ఉన్నది, కావున దరఖాస్తుదారుడు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నచో 30 రోజులలో వారు కోరిన సమాచారాన్ని సంపాదితధికారి సమాధానం ఇవ్వడం జరుగుతున్నది. ఒకవేళ సమాచారాన్ని దుర్వినియోగం చేసిన సమాచారం ఇవ్వకపోయినా సంబంధిత అధికారికి 250/- నుండి రూపాయలు 25 వేల వరకు జోరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్కు ఉంటుందని తెలియజేశారు.అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు పారదర్శకత జవాబుదారితనాన్ని పెంపొందించాలని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ కార్యవర్గ అధ్యక్షులు సయ్యద్ హైదర్,కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఏజిపి షబానా బేగం,మహిళా కార్యదర్శి సట్ల జమున, , రాష్ట్ర స్పోక్స్ పర్సన్ న్యాయవాది ఈక శ్రీనివాసరావు, నిజామాబాద్ పట్టణ అధ్యక్షు డు మహమ్మద్ ఫయాజ్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ తాటికొండ గంగాధర్ భీంగల్ సలహాదారులు మహమ్మద్ సమ్మద్, డిస్టిక్ సెక్రెటరీ నిజాంబాద్ రూలర్ దేశ్పాండి భూమేశ్వర్ నిజాంబాద్ మహిళా కార్యదర్శి రషీదా,బాన్స్వాడ డివిజన్ అధ్యక్షుడు నారాయణస్వామి, వడ్ల శ్రీనివాస్,ప్రతినిధులు షేక్ ఖలీల్, షేక్ బాషా, షేక్ జాకీర్, మనోజ్,రాజీవ్ గాంధీ, శ్రీనివాస్,రాజు, బాలకృష్ణ, లయాసత్, యునిస్, రహీం, జాఫర్, శీను, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.


