
పయనించే సూర్యుడు, అక్టోబర్ 18( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
బీసీ రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ కేంద్రీయ విద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతుండగా, పద్మనగర్ కేంద్రీయ విద్యాలయంలో బంద్ పాటించకపోవడంతో బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయం ముందు ధర్నాకు దిగిన వారు, వెంటనే ప్రిన్సిపాల్ స్పందించి బంద్ పాటించకపోవడానికి కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అందరూ ఏకమై పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.