
పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త గూడెం అక్కడే ఐదవ తరగతి వరకు చదువుకు న్నారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన మొక్కలు పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి ఆయన మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రామయ్య మరణం సమాజానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల కు తన ప్రాగాడ సాను భూతి తెలియజేశారు. ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవి రామయ్య అని సీఎం రేవంత్ అన్నారు. ఆయన సూచించిన మార్గాలు నేటి యువతకు మార్గదర్శకం అని సీఎం రేవంత్ అన్నారు.
పర్యావరణ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వనజీవి రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రాస్థిస్తున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు.