
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
పరిశ్రమలు మరియు ఫ్యాక్టరీల్లో 8 గంటల పని 13 గంటలకు పెంచుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఐటీయూ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్,రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు,పట్టణ కార్యదర్శి కే మహమ్మద్ గౌస్, నాయకులు సుబ్బారావు, జైలాన్ లతో పాటు 50మంది కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, కె. మహమ్మద్ గౌస్, వ్య. కా. సం. జిల్లా నాయకులు నరసింహ నాయక్, రైతు సంఘము జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు లు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కార్మికుల చట్టాలు రద్దుచేసి 4 లేబరు కోడ్ లను ఆమోదించింది. కోడ్ లు అమలుచేయాటంలో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం పనిగంటల పెంచి కార్మికులు శ్రమను యాజమాన్యాలు మరింత దోచుకోవడానికి అవకాశం కల్పించింది.ఎక్కువ సెలవులు పొందే విధంగా ఈ సవరణలు చేస్తున్నామని చెప్పటం కార్మికులను మోసగించటానికే. కర్నాటక బీజేపీ ప్రభుత్వం మొదటగా 2023లో ఫ్యాక్టరీల చట్టానికి సవరణలు చేసి పని గంటలు రోజుకి 12 చేసింది. వారానికి 48 గంటల పని కొనసాగుతుందని, వారంలోపే 48 గంటలు పూర్తయితే మిగతా రోజులు వేతనంతో కూడిన సెలవు దినాలుగా రాబోయే కార్మిక సంఘం కమిటీలు, నంద్యాల.
