
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 1
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పలు వార్తాపత్రికల్లో అమాయక ఆదివాసులను మోసం చేస్తున్న బిఎస్ఎన్ఎల్ ఫోర్ జి కాంట్రాక్టర్లు అనే శీర్షికతో వచ్చిన వార్తకు స్పందించిన చింతూరు డివిజన్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ యర్రం కాశి కి అలాగే బిఎస్ఎన్ఎల్ పై అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్న చింతూరు డివిజన్ ఆదివాసి జెఏసి చైర్మన్ జల్లి నరేష్.చింతూరు బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ కాశి మాట్లాడుతూ ఇదివరకు టవర్ ప్రాజెక్ట్ చేసిన వాళ్లు అందుబాటులో ఉన్న వాళ్లని పెట్టుకున్నారు అంతేకానీ ఉద్దేశించి ఎవరిని పెట్టుకోలేదు అని మా దృష్టికి వచ్చింది అని. అలాగే రాజమండ్రి క్లస్టర్ లీడ్ తోట వేణుమాధవ్ , స్టేట్ లీడ్ సాంబశివరావు , సహాయం తోటి ఇప్పుడున్న కేర్ టెకర్స్ అందరినీ మార్చి సంబంధిత గిరిజనులకే కేర్ టేకర్ పనిని ఇచ్చినట్టు తెలియజేశారు.
ఈ వార్తతో గిరిజనులు వర్షం వ్యక్తం తెలియజేశారు.