
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించటమే ధ్యేయంగా రైతులను ముందుకు నడిపించడమే పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని మండల వ్యవసాయ అధికారి కే. విజయకుమార్ తెలిపారు. కంచికచర్ల మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పరిటాల గ్రామంలో మంగళవారం నిర్వహించినట్లు కంచికచర్ల వ్యవసాయ అధికారి కె. విజయకుమార్ తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, పశు వైద్య అధికారులు తమ శాఖల పథకాల గురించి వివరించడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించటనీకి మెలుకువలు తెలియపరచారు. సరియైన మెళుకువలు పాటించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వనరుల కేంద్రం నుండి అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్ మనిషా, మండల వ్యవసాయ అధికారి కె. విజయ్ కుమార్, గ్రామీణ వ్యవసాయ సహాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు.