
పయనించే సూర్యుడు అక్టోబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఓవర్ బ్లాస్టింగ్లతో క్రాక్ ఇస్తున్న ఇల్లు
నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ
ఏన్కూర్ మండల పరిధిలో గల గార్ల ఒడ్డు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కంకర్ మిల్లు నిర్వాహకుల తీరు పై గ్రామ ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . కంకర మిల్ నిర్వాహకులు మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి పరిమితిని మించి లోతుగా త్రోవుతున్నారు. వారు రాయి కోసం ఓవర్గా బ్లాస్టింగ్ లు చేస్తున్నారు బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ రాళ్లు పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో పడుతున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులుకు గురవుతున్నారు. ఈ యొక్క కంకర మిల్లు ఊరికి దగ్గరలో ఉండటం బ్లాస్టింగ్ చేసినప్పుడు చాలా ఇళ్ళు గోడలు క్రాక్ వస్తున్నాయని అలాగే ఎల్ఈడి టీవీలు సైతం కాలిపోతున్నాయి. బ్లాస్టింగ్ చేయటానికి వాడేటువంటి బాంబులో కెమికల్స్ అవి పేలిన సమయంలో గాలిలో పొల్యూట్ అవుతూ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ప్రజలకి దుర్వాసన వస్తూ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్వారీల చుట్టూ పచ్చని వాతావరణం ఉండటం వలన మేకలు గొర్రెల మందలు మేతకు అటుగా వెళ్ళినప్పుడు ఆ క్వారీలో జారిపడుతూ అలాగే ఆ మూగ జీవాలు క్వారీలో ఆగినటువంటి నీళ్లు తాగటానికి వెళ్లి నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అయినప్పటికీ వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ క్వారీలలో రాళ్లు తీసుకొని క్రషింగ్ చేస్తూ వాటిని అమ్ముకొని సోమ్ము చేసుకుంటున్నారు. ఆ కంకర మిల్లుకు వెళ్ళేటటువంటి దారి పంట పొలాలకు ఆనుకొని ఉండటం రోజు ఆ దారిలో అధికంగా టిప్పర్లు తిరగటం వలన టిప్పర్లు వెళ్లే వేగానికి మట్టి దువ్వారం గాలికి లెస్తూ పక్కనే ఉన్నటువంటి పంట పొలాల మీద పడుతూ పంట పొలాలు వేసేటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అలాగే ఆ దారికి వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటం వలన దారి అంతా గుంతల మయంగా మారింది. రైతులు అదే దారిన వెళ్ళవలసి రావటం ఆ గుంటలు పడిన దారిలో వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి రైతులు ప్రజలు సంబంధిత ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకవటం ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నత అధికారులు కంకర మిల్ నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
