జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ లోప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నందలూరు ఎంపీడీవో రాధాకృష్ణ నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణలు పేర్కొన్నారు. బుధవారం స్వచ్ఛత ఈ సేవ కార్య క్రమంలో భాగంగా నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని ప్రధాన రహదారులను అధికారులు నాయకులు కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు . అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమన ఇంటి తోపాటు చుట్టుపక్కల పరిశోధన పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రోడ్లపైకి మురికినీటిని వదలరాదని చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదనిచెత్త బండ్ల లోనే వేయాలి అన్నారు. పరిశుభ్రత ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్. సచివాలయం టు కార్య దర్శి రమణ కార్మికులు అధికారులు పాల్గొన్నారు.


