
గనులు మరియు భూగర్భ శాఖ అధికారి కి వినతి పత్రం అందజేత..సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం..
పయనించే సూర్యడు // మార్చ్ // 29 // కుమార్ యాదవ్ ( హుజురాబాద్)..
ప్రభుత్వ భూమా, లేక రైతుల భుమా, అనే ఆలోచనలు లేకుండా తవ్వుకున్నామా, అమ్ముకున్నామా అనే విధంగా కొంత వరకు పరిమిషన్ తీసుకొని ఆ కొండలు మొత్తమే లేకుండా చేస్తున్నారు సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇనామ్ భూములు, అసైడ్ భూములు, లావాని పొట్ట, వాప్ బోర్డ్ దేవుడు మాన్యం లాంటి తేడ లేకుండా ఎక్కడిక్కడ కనబడిందల్లా దోచుకోవడమే ఈ గ్రానైట్ యాజమాన్యాలు దందా చేస్తున్నారన్నారు..కరీంనగర్ జిల్లాలోని పలు మండలాలలో మానకొండూర్, చెంబెర్ల, మొలంగూర్, కొతగట్టు, చింతలపల్లి, భేతిగల్, రంగాపూర్, లాంటి ప్రాంతాలలో అనేక ఎతైనకొండలను, కొంత వరకు పరిమిషన్ తీసుకోని, మొత్తమే లేకుండా తవ్వకాలు జరిపి కొన్ని కోట్ల రుపాయలకు, ఇతర ప్రాంతాలకు ఆమ్ముకుంటున్నారు అని తెలిపారు. తవ్వకాలలో భాగంగా అనేక వాన్య జీవులు తమ స్థావరాలను వదిలి గ్రామాలకి వెళ్తున్నాయి అని వివరించారు. సహజ వనరులు ప్రజల అందరికి ఉపయోగకరంగా ఉంటాయి, అని వింటే ఈ గ్రానైట్ పేరుతో ఉపయోగించుకో లేకుండా మారుతున్నా, ఇల చేస్తే మన ప్రాంతాలకు భూ ప్రకంపనాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అన్నారు.ఇక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇక్కడ గ్రానైట్ ను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.అని వ్యక్తం చేసారు. 2018.. 2025 నాటికి ఎంత గ్రానైట్ ఎగుమతి చేసారో వివరణ బహిరంగంగా తెలియజేయ్యాలి, అన్నారు. ఈ కొండలను తవ్వడానికి గోరంత అనుమతులు తీసుకోని, ఆ కొండలే మొత్తం లేకుండా చేస్తున్నారన్నారు. అక్రమంగా తరలించే గ్రానైట్ కి ప్రభుత్వనికి ఎంత సివరేజ్ చెల్లిస్తున్నారో బహిరంగంగా రికార్డులతో చెప్పాలన్నారు.కొన్ని గ్రానైట్ క్వారీలు సిసరెజ్ ఎగొట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొడుతున్నారు. అని వాటి అంతటికి కారణం గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉంది, అన్నారు.ఆక్రమంగా పరిమిషన్ లేకుండా ఉన్నటువంటి గ్రానైట్ క్వారిలపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించి పర్మిషన్లు ఎంత వరకు ఉన్నాయో అంత వరకే తవ్వకాలు జరిపి చూసి సినరేజి చెల్లించని క్వారీలను మరియు దీనికి సహకరించిన గ్రామ స్థాయి అధికారుల నుండి రాష్ట్ర స్థాయి అధికారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోని, ఆ యొక్క క్వారిలను సిజ్ చేయాలనీ హెచ్చరించారు. లేని ఎడల మైనింగ్ కార్యలయాల ముందు ధర్నాలు చేస్తామని తెలియజేసారు