
బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్
జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ వినోద్ నాయక్ కు ఘన సన్మానం
( పయనించే సూర్యుడు మే 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ జిల్లేడు చౌదరిగూడ మండల కోఆర్డినేటర్ గా చింతకుంట తండాకు చెందిన పాత్లవత్ వినోద్ నాయక్ నియమితులైన సందర్భంగా చౌదరిగూడ మండల కేంద్రంలో పాత్లవత్ వినోద్ నాయక్ ను ఘనంగా సన్మానించిన అనంతరం మాట్లాడారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మానవాళిపై ఉందని, క్షేత్రస్థాయిలో పర్యావరణం పై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన.స్వచ్ఛంద సంస్థల పైన, పర్యావరణ ప్రేమికుల పైన ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ హరితహారం అనే కార్యక్రమాన్ని చేపట్టి అడవుల శాతాన్ని పెంచారని, ఆ ఘనత కేసిఆర్ కు దక్కిందని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా అనువైన ప్రతి చోట మొక్కలను పెంచాలని, పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ చాలెంజ్ ఇండియా అనే పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కృషి చేయడం అభినందనీయమని, ఆయనకు తోడుగా మనమందరం నిలవాలని కోరారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు నటరాజ్, నర్సింగరావు, బాబు రావు, సత్య ప్రమోద్, జబ్బార్, అక్రమ్, రామచంద్రయ్య, గుండు అశోక్, ఇస్మాయిల్, మల్లేష్, నర్సింలు, పాండు, జహంగీర్, రాంచరణ్, ఆంజనేయులు, శివరాజ్, అసిఫ్, చందు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.