
పారం పాండు పనులను పరిశీలించిన కలెక్టర్

పయనించే సూర్యుడు మార్చి 25 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీ నందు జరుగుచున్న రైతు సమ్మయ్య ఫారం పాండు పనిని మంగళవారం పరిశీలించి కూలీలతో పాటు సరదాగా పలుగు పారా పట్టి పనిచేసినారు. అనంతరం రహదారి నిర్మాణం పనిని పరిశీలించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబం 100 రోజులు పూర్తి చేసుకోవాలని, ప్రతిరోజు ప్రతి కూలి 300 రూపాయలు కొలతల ప్రకారం పని చేసుకోవాలని ఎక్కువ గంటలు పని చేయాలని, మరియు ఎండాకాలం దృష్ట్యా ఉదయాన్నే ఉపాధి పనులకు హాజరయ్యి పని చేసుకోవాలని కూలీలకు తెలియజేశారు.రైతులు రాబోయే రోజులలో నీటి ఎద్దడి దృష్ట్యా అందరూ ఫారం పాoడు నిర్మాణాలను పెద్ద ఎత్తున నిర్మించుకోవాలని, ఎక్కువ ఆదాయం వచ్చే మునగ పంటల సాగును చేపట్టాలని రైతులకు తెలియజేశారు.రైతులు యాదగిరి రవి శ్రీను లు సాగు చేస్తున్న 6 ఎకరాల మునగ తోట సాగును పరిశీలించి రైతులతో మాట్లాడి వారు చేస్తున్న పని విషయంలో సంతృప్తి వ్యక్తం చేసినారు. ఎర్రాయి గూడెం గ్రామపంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో నూతనంగా నిర్మించిన రెండు పశువుల షెడ్లను గూగులత్ శాంతి మరియు బీమ్ల షేడ్ లను పరిశీలించి వీటిని పశువుల కొరకు సద్వినియోగం చేసుకోవాలని రైతులను ఆదేశించినారు.ఈ కార్యక్రమంలో.జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎల్ బీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన , ఎంపీడీవో జి. రవీందర్,ఎంపీఓ గాంధీ, ఏవో అన్నపూర్ణ, ఏపీవో శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, టిఏ ఈశ్వరి, ఎఫ్ఏ లు కార్యదర్శిలు, ఇతర శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.