
కందివనంలో సీసీ రోడ్డు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, పిట్టల గడ్డ తండాలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)
గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం కందివనం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 5.0 లక్షల సీసీ రోడ్డు, 4.0 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కందివనం గ్రామం పరిధిలో గల పిట్టల గడ్డ తండా లో ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా 70.0 లక్షల అంచనా వ్యయంతో పిట్టలగూడ తండా కు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, నాయకులు సూర్య ప్రకాష్, నర్సింహులు గౌడ్, పెంటయ్య,జనార్ధన్ గౌడ్,గోపాల్ గౌడ్,మోహన్,మహేందర్, మల్లేష్,శ్రీకాంత్,చంద్రయ్యా, పెంటయ్య, రతన్ నాయక్,హన్మంతు ,సీతారాం నాయక్, డిక్యా నాయక్,చిన్న తదితరులు పాల్గొన్నారు.