పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 11 మామిడిపెల్లి లక్ష్మణ్
చైనా మాంజా వల్ల పక్షులకు, మానవులకు ప్రమాదం పొంచి ఉన్న కారణంగా, శనివారం రోజు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మ ఆధ్వర్యంలో పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణదారులతో ఆమె మాట్లాడుతూ.. ఎవరు కూడా చైనా మాంజా దారాలను తెప్పించకూడదని,ఎవరైనా తెప్పిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని అన్నారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు రమణారెడ్డి, సంధ్య,కవిత,చంద్రశేఖర్ పాల్గొన్నారు.