
పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 11
వార్తా విశ్లేషణ సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కుచర్ల గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందించాలన్న సదుద్దేశంతో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినప్పటికీ సత్ఫలితాలు కానరావడం లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉప కేంద్రాలలో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండట్లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సబ్ సెంటర్లు ను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే పల్లె దవఖానలో ఏఎన్ఎంలు తోపాటు రోగులకు చికిత్సలు చేసేనందుకు వైద్య అధికారి హోదాలో ఏఎన్ఎంల ను ఏర్పాటు చేశారు మండలంలో ఈ కేంద్రాలు ఎక్కడ కూడా సక్రమంగా పనిచేయడం లేదుని సమాచారం పల్లె దవాఖానాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోగులకు చికిత్స చేయాలి శనివారం మధ్యాహ్నం బుర్కుచర్ల గ్రామంలో 12.30 గంటలకు పల్లె దవాఖానాకు తాళం వేసి కనిపించింది అక్కడ ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఉండాల్సి ఉండగా తాళం ఉండడం గమనార్హం పల్లె దవాఖానాల ద్వారా ప్రజలకు ఏదైనా జబ్బు పడితే చికిత్స చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో వాటిని ఏర్పాటు చేస్తే వాటికి తాళాలు తీసేదుక్కు లేకుండా పోతుంది వారు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన ఆరోగ్య వైద్యశాఖ అధికారులు పర్యవేక్షణ కరువైంది అని ప్రజల సమాచారం.