Tuesday, July 1, 2025
Homeఆంధ్రప్రదేశ్పసుపు రైతుల కల ఎక్కడ నెరవేరింది… అమిత్ షా గారు

పసుపు రైతుల కల ఎక్కడ నెరవేరింది… అమిత్ షా గారు

Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కె గంగాధర్ నిజామాబాద్ రూరల్ :జులై 01::

కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ

ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పెద్ద ఎత్తున తరలి రావాలి


గత నెల 29వ తేదీన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా పసుపు రైతుల కల నెరవేరిందని సభలో అన్న విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా పసుపు రైతుల కల ఇక్కడ నెరవేరిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి అమిత్ షా ను కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో అన్నారు. పసుపు మూడు కార్యాలయాన్ని ఇప్పటికే మూడుసార్లు ప్రారంభించారని, పసుపు రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని అన్నారు. ఇంతవరకు పసుపు బోర్డు లో కార్యవర్గం లేదని ఎద్దేవా చేశారు. గతంలో పసుపు రైతులు ఉద్యమాలు చేస్తే ఇప్పటివరకు వారి పైన కేసులు ఉన్నాయని అన్నారు. పసుపు రైతుల పైన ఉన్న కేసులను కేంద్రం ఎందుకు కొట్టేయలేదని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు పేరు పైన అమిత్ షా రావడం స్థానిక సంస్థల స్టంటేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పసుపు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుందని, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు బిజెపి చెప్పే మాయ మాటలు నమ్మరని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థాయి సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్యఅతిథి హాజరై ఈ సందర్భంగా మాట్లాడినారు.ఈ నెల 4న జరిగే కాంగ్రెస్ పార్టీ విస్తృస్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే వస్తున్నారని, పార్లమెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అన్ని విభాగాల అనుబంధ సంస్థల అధ్యక్షులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు సమావేశానికి హాజరుకావాలని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ ,బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, ఈరవత్రి అనిల్ డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments