
//పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 25//మక్తల్. మాధ్వార్ గ్రామం : పహాల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించి దాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించడం జరిగింది. మాట్లాడుతూ ” ఇలాంటి కుటిల నీతితో అంతర్గత భద్రతను భంగం కలిగించడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పటికీ నెరవేరదు ప్రపంచ దేశాల కంటే ఉన్నతమైన దేశం భారతదేశం ఇక్కడ విభిన్న మతాలకు అతీతంగా కలిసిమెలిసి నివసించే దేశం. ఈ దేశాన్ని ఉగ్రవాదంతో విడగొట్టే ప్రయత్నం చేస్తే పుట్టిన పిల్లవాడు కూడా ఊరుకోడు” అని అన్నారు. ఈ సందర్భంగా . మల్లెపల్లి ఆశప్ప. ఈడిగి వెంకటేష్ గౌడ్.తపాస్ మరికల్ ప్రధాన కార్యదర్శి జంగం శివ శంకర్. పంచాయతీ సెక్రెటరీలు .ప్యాట రాములు. నస్లై తిమ్మప్ప. మాట్లాడుతూ” ప్రత్యక్షంగా ఎదుర్కోలేని పిరికిపందలు భారతదేశ సమైక్యతను భంగం కలిగించడానికి, కుల మతాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ఈ ఉగ్రదాడిని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దాడిలో ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో. వడ్ల నరసింహులు. వడ్ల భాను ప్రకాష్. గుడిసె రాజు. కురువ రాము. మంగలి నాగేష్. ప్యాట అంజప్ప. బాట రాజు. కర్నే కృష్ణయ్య. చాకలి వెంకటప్ప. కురువ రామలింగేశ్. బుడే బోయి నరసింహులు. కర్నే నరేష్. తదితరులు పాల్గొన్నారు