
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం లో ఉన్న 93 పాఠశాలలకు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి అజ్మీర జగన్ స్కూల్ యూనిఫామ్ ను పంపిణీ చేశారు, ఈ యూనిఫామ్ 2025 మరియు 2026 సంవత్సరాలకు సంబంధించినవని, ఈ యూనిఫాములను జూన్ నెలలో పిల్లలకి అందిస్తారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.
కాంప్లెక్స్ హెచ్ఎం జోగ రవి, ఎంపీపీస్ టేకులపల్లి హెచ్ఎం వెంకయ్య, ఎంఆర్సి స్టాప్ భాస్కర్ రావు, సంధ్యారాణి, గోపాలరావు, నాగేశ్వరావు, రవి, భాస్కర్, చందర్ రావు, అబ్బయ్య, బాలాజీ, పాల్గొన్నారు.