Tuesday, August 5, 2025
Homeఆంధ్రప్రదేశ్పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలి

పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలి

Listen to this article

హెల్త్ కార్డు సమస్యలు పరిష్కరించాలి

సుండుపల్లె ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి

పయనించే సూర్యుడు ఆగస్ట్ 5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం

రాష్ట్రంలో వర్కింగు జర్నలిస్టులకుcఅక్రెడిటేషన్లు వెంటనే జారీ చేయడం సహా జర్నలిస్టుల పెండింగు సమస్యలు పరిష్కరించాలని ఏపీయూడబ్ల్యూజే సుండుపల్లి మండల శాఖ పాత్రికేయులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సీనియర్ అసిస్టెంట్ మధుకు వినతి పత్రం అందజేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగు జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్లు జారీ చేయడంలో అనవసర జాప్యం చేస్తుందన్నారు. అక్రెడిటేషన్ లేక పోవడంతో జర్నలిస్టులు పలు సదుపాయాలను పొందలేకపోతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో 23000 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఉండగా 2019 2024 మధ్య వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డగోలు నిబంధనలతో, అసంబద్ధ నియమాలతో అక్రెడిటేషన్ల సంఖ్యను 9 వేలకు కుదించింది. పాత అక్రెడిటేషన్ల గడువును పదేపదే పొడిగిస్తూ కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం జర్నలిస్టులను తీవ్రంగా వేధించింది. దాంతో అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ లేకపోవడమే కాకుండా వారికి హెల్త్ కార్డ్ పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారు. గతప్రభుత్వం అమలు చేసిన అడ్డగోలు నియమాలను సవరించి పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకూ అక్రెడిటేషన్ నియమాల సవరణకు సంబంధించిన కొత్త జీవో విడుదల కాలేదు. దాంతో గత ప్రభుత్వం నాటి అక్రెడిటేషన్లు మాత్రమే ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో పాత అక్రెడిటేషన్ల గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రెడిటేషన్ల గడువు ఆగస్ట్ 31 వ తేదీకి ముగుస్తున్నది. మరోసారి గడువు పొడిగించకుండా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో అమల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డ్ పథకంలో ఉన్న లోటుపాట్లను సవరించి దాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాము. WJHS పథకం అమల్లో ఎదురవుతున్న రోజువారీ సమస్యల పరిష్కారానికి సమాచార శాఖ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనీ, తద్వారా జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. జర్నలిస్టుల సర్వీసును, వయసును, విధినిర్వహణ ద్వారా సమాజానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని, విశ్రాంత జీవితాన్ని గౌరవప్రదంగా గడపడానికి వీలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించాలని కోరుతున్నాము. గౌ. శ్రీ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2016 లో ప్రవేశపెట్టగా, గత ప్రభుత్వం నిలిపి వేసిన ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునః ప్రారంభించాలని కోరుతున్నాము. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాము.వర్కింగు జర్నలిస్టుల పెండింగు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు 2025 ఆగస్ట్ 5 వ తేదీన చేపట్టిన రాష్ట్రవ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా ఈ వినతి పత్రాన్ని అందజేశాము. పాత అక్రెడిటేషన్ల గడువును ఇక ముందు పొడిగించకుండా, రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడిటేషన్లు వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర, జిల్లా స్థాయి, అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలి. వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలి. స్కీం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక తైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. వర్కింగు జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి. విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయ పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలి. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండలం గౌరవ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి, అధ్యక్షుడు తిరుపాల్ నాయక్, జిల్లా కోశాధికారి పల్లం చందు, ఉపాధ్యక్షుడు యూసుఫ్,ప్రధాన కార్యదర్శి భూపయ్య, కోశాధికారి గోపాల్, కార్యవర్గ సభ్యుడు పాల రెడ్డయ్య, కర్ణ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments