పూజల్లో పాల్గొన్న మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు పయనించే సూర్యుడు జనవరి 13 పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి పాల్వంచ టౌన్:
ధనుర్మాస పూజల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ లోని అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం గోదారంగనాధుల కల్యాణాన్ని* ఘనంగా నిర్వహించారు దేవాలయం పూజారి కందాల సింహాద్రి ఆనంద్ కుమారాచర్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ రావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, దేవాలయం బాధ్యులు కిలారి సుజాత, పుష్పాల వెంకటేశ్వర్లు, పుష్పాల కృష్ణ, లోగాని రాంబాబు, కళావతి, సీతక్క, సత్యవతి, గాంధీ, కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న, వై వెంకటేశ్వర్లు, ఉండేటి శాంతి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు
పాత పాల్వంచ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా గోదారంగనాధుల కళ్యాణం*
RELATED ARTICLES