
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పాపారాయుడు నగర్ కాలనీ సొసైటీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాటలో లడ్డును ఒక లక్ష పది హెడు వేల రూపాయలకు కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల నియమ నిష్ఠలతో కాలనీ ప్రజలందరూ పూజల్లో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు, ఈ మహిమగల లడ్డూను వేలంపాట కూడా విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహం ప్రదర్శించారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహించే ఈ లడ్డూ వేలంపాట, వినాయక నిమజ్జన మహోత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. లడ్డూను శుభప్రదంగా భావించే భక్తులు దానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులతో పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.