
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి ఆదేశాను ప్రకారం పారా లీగల్ వాలంటీర్స్ బి.బిక్షమయ్య మరియు ఎం. జానకిరామ్ కాంట్రాక్టర్స్ కాలనీ పాల్వంచలో ఉన్న అగాపే స్కూల్ లో ” మనో న్యాయ క్లినిక్ ” ను ఏర్పాటు చేయడం జరిగింది. క్లినిక్ ను ఏర్పాటు చేయడం మొదలు అక్కడి సమస్యలను స్కూల్ టీచర్ క్రిసోలైట్ ను అడిగి తెలుసుకొని దరఖాస్తును స్థానిక మున్సిపల్ కమిషనర్ కు అందజేసి సమస్య పరిష్కారం అయ్యే అంత వరకు కృషి చేశారు. ఫలితంగా ఆగాపే స్కూల్ కు పైప్ లైన్ ద్వారా వాటర్ ట్యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి గురువారం వారిని ప్రత్యేకంగా అభినందించారు. పారా లీగల్ వాలంటీర్స్ తమ కార్యక్రమాలను సేవాభావం తో మరింతంగా విస్తృత పరచాలని న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, పారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.