
పయనించే సూర్యుడు మే 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదని, నూతనంగా పార్టీ మండల కమిటిలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కమిటిలను ప్రకటించడంతో పార్టీ పదువులు పొందిన నాయకులు ఆత్మకూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించి తమకు పార్టీ తరపున పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.పార్టీలో మంచి అవకాశం ఇవ్వడం అదృష్టంగా బావిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో పటిష్టం చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేసి పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డిలను సత్కరించి మిఠాయిలు అందచేసి తమఆనందాన్ని పంచుకున్నారు.మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ పదువులు తీసుకున్న ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి పార్టీ కార్యక్రమాలలో విరివిరిగా పాల్గొనాలని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సహకారాలైనా అందిస్తామని, పార్టీకి ప్రతి ఒక్కరి అండదండలు ఉండాలని కోరారు.