
పయనించే సూర్యుడు మార్చి 5 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాల నాయకులు నియోజకవర్గం నేతలు పార్టీ కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ కోరారు దీనిలో భాగంగా మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు 14వ తేదీన జనసేన నేతలు భారీ ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పార్టీ ఆవిర్భావ సభ ఇది అని చిత్రాడ సభ వేదికగా పార్టీకి సంబంధించిన పలు అంశాలను అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడిస్తారని ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయనున్నారని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు సైతం సిద్ధంగా ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం ప్రచార కమిటీ కన్వీనర్ సాగర్ రాంతాలూరి వీర మహిళ అధ్యక్షురాలు కావ్య మండపాక శిరీష మరియు వివిధ జిల్లాల కోఆర్డినేటర్స్ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు