
రైతు వేదికలో వీడియో కాన్ఫిరెన్స్ తిలకిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
సెంట్రల్ గవర్నమెంట్ అందజేచేస్తున్నటువంటి పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరిగింది. రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి సాయికృష్ణ, ఏఈవో వెంకటేష్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల ఆధ్యక్షులు ఆలపాటిహరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, బోజిగొండ అనిల్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవర్, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు బేగరి శివప్రసాద్, మండల కార్యదర్శి ఈరోళ్ల శంకర్, బేగరి సాయికుమార్ నేమ్లీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.