
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి(ఎస్ఎంకుమార్) 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలిసి కాలనీలోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీ లో త్రాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందించామని అన్నారు. కాలనీ వాసు లు కోరిన విధంగా వీధి దీపాలు, కొంత మేర మిగిలిఉన్న సీసీ రోడ్లు త్వరలో నిర్మిస్తామని అన్నారు. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువ స్తే వెంటనే పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, భాస్కర్, అగ్రవాసు, మహేష్, బషీర్, ఖలీమ్, సుధాకర్, వెంకట్, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.