
ప్రాజెక్టు పేరుతో ఆదివాసిలకు అన్యాయం.
అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రంఅందజేసిన జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి.
పయనించే సూర్యుడు: మే22: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా నూగూరువెంకటాపురం మండలం బిసి మర్రిగూడెం గ్రామపంచాయతీ లో గ్రామ సభకు హాజరైన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వాడ గూడెం జి సర్వే నెంబరు 44 /p లో కమ్మరి గూడెం ఆదివాసులకు అసైన్మెంట్ ద్వారా ఆదివాసులకు 33 మందికి అసైన్మెంట్ ద్వారా పట్టాలు మంజూరు చేశారని ఆ పట్టా ల్యాండ్ లో పాలెం ప్రాజెక్టు కాలువతో ఆదివాసీలు నష్టపోతున్నారని, అడిషనల్ కలెక్టర్ గారికి జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి. పూనెం సాయి. వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి. పూనెం .సాయి. మాట్లాడుతూ వాడగూడెం జి సర్వే నెంబరు 44/p లో కమ్మరిగూడెం ఆదివాసీలకు అసైన్మెంట్ ద్వారా 33 మందికి 1986లో అసైన్మెంట్ చేశారనిఅన్నారు. అసైన్మెంట్ ద్వారా వచ్చిన భూమిని కమ్మరిగూడెం ఆదివాసీలు సాగు చేసుకుని జీవన ఉపాధి కొనసాగుతున్నారనిఅన్నారు. ఆదివాసుల పట్టా భూముల నుండి ప్రాజెక్టు ల పేరుతో ఆదివాసీల పొట్ట కొట్టొద్దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆదివాసీలు భూములను కూడా ఈ ప్రాజెక్టుల పేరుతో లాక్కున్నారని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరుతోనే ఆదివాసీలు అభివృద్ధి అయ్యారా లేక గిరిజనేతరులు అభివృద్ధి అయ్యారా అనే విషయం జిల్లా అధికారులు సమాధానం చెప్పాలనీ అన్నారు. ఏజెన్సీ ఏరియా 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసి భూములు తీసుకోవాలంటే ఏజెన్సీ ఏరియాలో పెస గ్రామసభలు నిర్వహించాలనిఅన్నారు. ఆ పిసా గ్రామ సభలను అధికారులు గౌరవించాలని ఆ పెసా చట్టం పార్లమెంటు చట్టాన్ని జిల్లా అధికారులు మండల అధికారులు ఎందుకు గౌరవించడం లేదని ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో పూనెం గోవర్ధన్, వంశీ, నవీన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
