
పయనించే సూర్యుడు గాంధారి 07/8/25
గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు గ్రామ శివారు గల గండి మైసమ్మ కుంట భూమి ఫారెస్ట్ భూమి అని అట్టి భూమిలో ఫారెస్ట్ అధికారులు వద్దు అన్న కానీ సీతాయి పల్లి కి చెందిన కోర్రె మల్లయ్య నాలుగు ఎకరాల వరి పొలమును నాటు వేయగా ఫారెస్ట్ వారు అది అటవీ భూమి అని అట్టి పొలములో గడ్డి మందు కొడుతుండగా ఫారెస్ట్ వారిని మల్లయ్య మరియు మరి కొందరు అడ్డు కోని విధులకి ఆటంకం కల్గించినరాని,అదే విషయమై ఫారెస్ట్ అధికారులు కోర్రె మల్లయ్య మరియు మరో కొంత మంది పైన ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు అయినది. అదే సమయంలో మల్లయ్య తమ్ముడైన కోర్రె చిన్న మల్లయ్య S/o దేవయ్య ఫారెస్ట్ వాళ్ళు కొట్టిన గడ్డి మందు డబ్బాతో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ కి రాగా వెంటనే అది గమనించిన గాంధారి పోలీసులు, అతని దగ్గర డబ్బా లాక్కొని గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డికి పంపనైనది. ప్రస్తుతం చికిత్స ఇస్తున్నారు