
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా. అనంతపురం జిల్లా యాడికి సీ.పీ.ఐ. రాష్టసమితి పిలుపుమేరకు యాడికి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ కూడలి నుండి ర్యాలీగా బయలుదేరి శనివారం విద్యుత్ కార్యాలయం ఎదుట బైఠాయించి సి.పి.ఐ.నాయకులు ధర్నా నిర్వహించారు
ఈ సంధర్బంగా సి.పి.ఐ.జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్ సీ.పీ.ఐ.మండలకార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ,
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రూ.15.485 కోట్ల భారం ప్రజలపై మోపింది. అంతేగాక గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు మోడీ ప్రభుత్వవిధానాలను తీసుకోస్తున్నది. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలనుమరచి విద్యుత్ చార్జీల భారాలను మోపటం ప్రజలను మోసగించడమే అన్నారుగతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ చార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని, అవసరమైతే పగలగొట్టాలని సూచించారు. అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కూటమిప్రభుత్వము ఏడాది కాలంలో 4 సార్లు విద్యుత్ చార్జీల భారాలను వినియోగదారులపై మోపారు. గృహ వినియోగాలకు సంబంధించి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమయ్యారు, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాల వల్ల రానున్న 25 ఏళ్లపాటు దాదాపు ఒక లక్షా పదివేల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుంది. ఈ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం కనీసం సమీక్షగాని, కనీసం నోరు మెదపడంగానీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని అదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సి.పి.ఐ. తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఓబిరెడ్డి, సి.పి.ఐ.మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు, చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ, సి.పి.ఐ.పట్టణ కార్యదర్శి కుల్లాయి రెడ్డి , రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ సి.పి.ఐ. సీనియర్ నాయకులు ఎల్.అండ్.టి. నబి రసూల్, రమణయ్య, సిపిఎం మండల కార్యదర్శి బషీర్ సిపిఎం పట్టణ కార్యదర్శి మోహన్ సి.పి.ఐ.నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
