
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు మార్చ్ 19 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల మూడు వారాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు నియోజకవర్గ కన్వీనర్ శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం నాడు ఆయన ఫరూక్ నగర్ మండలంలోని పీర్లగూడ.చించోడు. అయ్యవారిపల్లి గ్రామాలలో ఉపాధి హామీ పనిచేస్తున్న పని ప్రదేశంలో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రటి ఎండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు పనిచేస్తున్నారని వారికి కనీస అవసరాలు తాగేందుకు నీళ్లు ఎండ నుంచి ఉపశమనం కలిగించుటకు టెంటును మరియు ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు అందించాల్సి ఉన్న ఏవేవి అందుబాటులో లేవు అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి కూలీ రోజువారి 300 నుంచి 800 పెంచి ఇవ్వాలని వారం వారం కూలి డబ్బులు వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని పేదలకు 12,000 అందరికీ వర్తింప చేయాలని. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇవ్వాలన్నారు కొత్తగా దరఖాస్తు చేసిన అందరికీ జాబ్ కార్డులను ఇచ్చి పని కల్పించాలన్నారు లేనిచో కార్మికులను. ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు మల్లేష్ కిట్టు చంద్రకాంత్. శ్రీను యాదయ్య. శంకర్ నాయక్. శివ శంకర్ ఆంజనేయులు కృష్ణయ్య. రామచంద్రయ్య. ముసలయ్య తదితరులు పాల్గొన్నారు