
పయనించే సూర్యుడు గాంధారి 17/07/25
*పి డి ఎస్ యూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అధ్యక్షుడు అనుముల సతీష్ ఈరోజు గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పి డి ఎస్ యు కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి ఉత్తరాలు వ్రాయడం జరిగింది ఈ సందర్భంగా పి డీ ఎస్ యూ జిల్లా అధ్యక్షుడు అనుముల సతీష్ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను మర్చిపోయింది అన్నారు దాదాపు రాష్ట్రంలో 8,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయని కారణంగా ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ప్రీయంబర్స్మెంట్లను విడుదల చేయాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వనికి హెచ్చరించారు ఈ పోస్ట్ కార్డులను గాంధారి తపాలా కార్యాలయం నందు తెలంగాణ సచివాలయం కు పోస్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు మోజీ రామ్, నాయకులు గణేష్ సురేష్ నరేష్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి