
పయనించే సూర్యుడు మార్చి 7 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి నుండి ఫస్ట్ తారీకు వేతనాలు చెల్లిస్తామని ప్రకటించి రెండు నెలలుగా పెండింగ్ శాలరీలు ఇవ్వకపోవడం దారుణమని వెంటనే పెండింగ్ శాలరీ విడుదల చేయాలని శుక్రవారం టేకులపల్లి ఎంపీడీవో రవీంద్ర రావు కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మాలోత్ సతీష్, మండల అధ్యక్షులు బాధవత్ వీరన్న, మండల ప్రధాన కార్యదర్శి బోడా ప్రవీణ్, సిఐటియు మండల నాయకులు కడుతుల వీరన్న, గ్రామపంచాయతీ సిబ్బంది శివ, బోడకా, వెంకటేష్, బాలాజీ నాను అనిల్ చింగి పాల్గొన్నారు.