
పయనించే సూర్యుడు:మే 03: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలో శుక్రవారం జల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాల్ రావు మరియు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్ ఆదేశాలతో అసెంటామిక్ సర్వే గ్రామపంచాయతీ నాగారం గ్రామం పెనుగోలు కాలనీలో నిర్వహించారు. పెనుగోలు కాలనీలో ఎంపీ ఓ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి ప్రభాకర్ రావు, వైద్య సిబ్బంది సమన్వయంతో డ్రై డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందనీ,ప్రజలకు వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని. వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేయడం జరిగింది, ఈ సర్వే మలేరియా కేసులు నమోదైన గ్రామాలలో అసెంటిమాక్ ఐరిస్ గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు,ఈయొక్క కార్యక్రమంలో వాజేడు వైద్యాధికారి. మధుకర్,ఎంపీ ఓ. శ్రీకాంత్, గ్రామపంచాయతీ సెక్రెటరీ ప్రభాకర్, హెల్త్ సూపర్వైజర్స్ వెంకటరమణ. కోటిరెడ్డి. హెల్త్ అసిస్టెంట్స్,చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం. రాజేశ్వరి. ఆశా కార్యకర్తలు. శాంత కుమారి. లక్ష్మి. మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగిందనీ తెలియజేశారు.
