
పెసా చట్టాన్ని అమలు పరచని పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
పయనించే సూర్యుడు జులై 30 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి:గిరిజన చట్టాలు అంటే అధికారులకు అంత చులకన భావన ఎందుకు ఏజెన్సీ ప్రాంత ప్రజల చట్టాలను గౌరవించని అధికారులు ఎందుకు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నారు పెసా చట్టాన్ని దుర్వినియోగపరిచిన దాస్ తండా టేకులపల్లి కార్యదర్శులను వెంటనే సస్పెండ్ చేయాలి
ఎంపీడీవోని ఫిర్యాదు చేసిన సేవాలాల్ సేన నాయకులు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నత స్థాయి అధికారులు వారిని రక్షించే ప్రయత్నం చేయడం బాధాకరమని పెసా గ్రామ సభలో కార్యదర్శులు చేసిన తప్పు బహిర్గతమైనప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమని ఇప్పటికైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుధవారం ఎంపీడీవో మల్లేశ్వరిని సేవాలాల్ సేన నాయకులు కోరారు.టేకులపల్లి మండలంలో అధికారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతుందని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు మాలోత్ శివ నాయక్ అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల అధికారులు చట్టాలను అవమానపరిచే విధంగా ఉన్నారని గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తున్నారని అటువంటి అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఎంతో విచారకరమని లేక గిరిజనులు అంటే చులకన భావన అని మండల అభివృద్ధి అధికారిని ప్రశ్నించారు. గిరిజన చట్టాలను అవమానపరిచే అధికారులు మా మండలానికి అవసరం లేదని అటువంటి వారు ఎవరైనా ఉంటే మండలం నుంచి వెళ్లిపోవాలని అంతేగాని మా గిరిజనులను మా గిరిజన చట్టాలను హేళన చేసిన అవమానపరిచిన ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం జరిగిన పెసా గ్రామ సభల్లో నియమ నిబంధనలను ఉల్లంఘించి గ్రామసభ జరిపిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిండికేటుగాళ్లు ఇచ్చిన కాసులకు కక్కుర్తి పడి ఒకరి ఇద్దరితో గ్రామసభ ముగించారని అది ఏవిధంగా చెల్లుబాటు అవుతుందని మరల గ్రామసభ నిర్వహించాలని లేనియెడల సేవల సేన సంఘం ఉద్యమాలకు దిగుతుందని హెచ్చరించారు. పెసా గ్రామసభ మరల నిర్వహించకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని అన్నారు. ఏజెన్సీ చట్టాలను అవమానపరిచేలా వ్యవహరించిన అధికారులను రక్షించే విధంగా జాప్రతినిధులు ప్రయత్నించడం బాధాకరమని అన్నారు.విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం స్థానిక ఎంపీడీవో బి మల్లేశ్వరి మాట్లాడుతూ రెండు గ్రామసభల నుంచి ఫిర్యాదులు అందాయని విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజంగా తప్పు జరిగి ఉంటే మరల గ్రామసభ నిర్వహిస్తామని ఉన్నత స్థాయి అధికారులకు రిపోర్ట్ పంపిస్తామని హామీ ఇచ్చారు.