
పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
అనంతసాగరం మండలం బొమ్మ వరం గ్రామంలోని పేకాట స్థావరంపై పోలీసుల దాడులు గురువారం.నిర్వహించారు. ఆత్మకూరు సిఐ గంగాధర్ స్థానిక ఎస్సై సూర్య ప్రకాష్ రెడ్డి .సిబ్బందితో కలిసి గ్రామ శివారులో ఆకస్మిక దాడులు చేపట్టగా పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని 5 బైకులు 69,500 నగదును సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ గంగాధర్. తెలిపారు.ప్రభుత్వ నిషేధం లో ఉన్న పేకాట, కోడిపందాలు ఇతర జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా సిఐ గంగాధర్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి హెచ్చరిక చేశారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు