
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
మే 16 పార్టీ కోసం కష్టపడిన వారికి ఎప్పటికీ పార్టీ అండగా ఉంటుందని మరోసారి రుజువు చేసింది 25 సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కు రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరి 2019లో బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పొంది న కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ పార్టీకి పూర్తి సమయం ఇచ్చి ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పార్టీకి ఏనలేనటువంటి సేవలు అందించారు. నిరుపేద కుటుంబాలు పుట్టినప్పటికీ ఏనాడు కూడా నిరాశ చెందకుండా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పని చేసుకుంటూ వచ్చారు వారు పనిని గుర్తించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టడం హర్షణీయమని బిజెపి నాయకులు తుర్రం అశోక్ కుమార్ దొర తెలియజేశారు.చింతూరు మండలం బిజెపి నాయకులు తుర్రం అశోక్,మరియు తుర్రం రాంకోటి రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్ పర్సన్ సోళ్ల బొజ్జిరెడ్డి ని రంపచోడవరం పి ఎం ఆర్ సి నందు కలిసి శాలువాతో సత్కరించారు. తదనంతరం చింతూరు డివిజన్ సంబందిచిన సమస్యలు విషయాలు వివరించారు. సానుకూలం స్పందించి త్వరలో చింతూరు డివిజన్ పర్యటనకు వాస్తానని తేలియజేసారు