
శనిగరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( హుజురాబాద్)..
తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రారంభించడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి
మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం అందిచడం గర్వాంగా ఉంది అన్నారు.పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసినా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉగాది నాడు ఈ సన్న బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందన్నారు. పేదలు కడుపునిండా అన్నం, తినాలి అనే సంకల్పం రేవంత్ రెడ్డి కీ రావడం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం నిరుపేదలకు సన్న బియ్యం పతకం అమలు చేసారు అని పేర్కొన్నారు.