
ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిచడమే ప్రజా ప్రభుత్వం ఉదేశ్యం – ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 01 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
కేశంపేట మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని షాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా కేశంపేట్ మండల కేంద్రంలోని రేషన్ షాప్ వద్ద రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయం అని పేర్కోన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం మా ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గూడా వీరేశం, బ్లాక్ అద్యక్షులు జగదీశ్వర్,మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి,బీసా కరుణాకర్ రెడ్డి,సురేష్ రెడ్డి,పర్వతాలు,రామ్ రెడ్డి,బిసి సెల్ అధ్యక్షులు రావుల పెంటయ్య , కోడూరు రాములు,పల్లె ఆనంద్, మరియు వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు కర్ణాకర్ ,భాస్కర్ గౌడ్ ,ఎస్ సి సెల్ అధ్యక్షులు భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రూప్ల నాయక్ ,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గిరి యాదవ్, తుమ్మల గోపాల్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ప్రకాశ్, యువజన ఉపాధ్యక్షులు ఆవ రాఘవేందర్,మహిళా నాయకురాలు అనసూయ,రేణుక,నర్సమ్మ,చెన్నమ్మ,ముత్యాలమ్మ,పాండు, నాగేష్, పవన్ కుమార్,శ్రీకాంత్ రెడ్డి, నరసింహ,ప్రకాశ్ చారి,వెంకటేష్, భీమయ్య,సురేష్,లింగం,మల్లేష్ గౌడ్, మల్లేష్, రాజేష్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.