Sunday, February 2, 2025
HomeUncategorizedపేదల సంక్షేమానికి పెద్దపీట, ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అభినందనీయం.

పేదల సంక్షేమానికి పెద్దపీట, ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అభినందనీయం.

Listen to this article

————శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షుడు జిఎం శేఖర్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా… మధ్యతరగతి ప్రజలకు లక్షల కోట్ల పన్నుల భారం తగ్గించారు. ఇప్పుడు రూ. లక్ష ఆదాయం సంపాదించే వారికీ ఆదాయపు పన్ను లేదు. ఒక రూపాయి జాగ్రత్త చేసుకోవడం అంటే.. ఓ రూపాయి సంపాదించుకోవడమే అంటారు. ఇప్పుడు పన్ను భారం అంతా తీసివేయడం వల్ల ఒక్కో మధ్యతరగతి కుటుంబానికి ఏడాదికి రూ.50 నుంచి రూ.1.5 లక్షల వరకూ ఆదాయాన్ని కేంద్రం ప్రభుత్వం ఇచ్చినట్లే. ప్రధాని మోదీ గుండెల్లో ఎప్పుడూ మధ్యతరగతి వారు ఉంటారు. ఆ విషయం మరోసారి ఈ బడ్జెట్‌తో నిరూపితమయింది. ఎన్డీఏ పాలనలో ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. దానికి తగ్గట్లుగానే పన్ను మినహాయింపులు ఇస్తూ.. ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి సంకల్పిచిన కేంద్రానికి ఈ సందర్భంగా మధ్యతరగతి ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేశ పురోభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ అని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంతృప్తి వ్యక్తం చేసింది. స్టాక్ మార్కెట్లన్నీ పాజిటివ్ గా తీసుకున్నాయి. ప్రాణాధర మందుల ధరలను తగ్గేలా నిర్ణయించడం ప్రభుత్వ మానవతా దృక్పధానికినిదర్శనం. వ్యవసాయం సహా ప్రతి ఒక్క రంగానికి కేంద్రం పురోగమించడానికి అవసరమైన వనరులు సమకూర్చడం దగ్గర నుంచి పన్నుల భారం తగ్గించడం వరకూ ఎన్నో చర్యలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అదనపు సాయం చేయడానికి, సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించడం ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప వరం. అన్ని కేంద్ర పథకాల్లోనూ ఏపీకి మంచి వాటా ఉంటుంది. అమరావతికి గత బడ్జెట్‌లో చేసిన సాయంతో రూ. 40 వేల కోట్లు పనులు ప్రారంభమవుతున్నాయి. వచ్చే నాలుగేళ్లలో హడ్కో, ప్రపంచబ్యాంక్ సహా వివిధ వర్గాల నుంచి నిధులు వస్తాయి. డబుల్ ఇంజిన్ పాలన ప్రయోజనాలను ఏపీ గరిష్టంగా పొందుతోంది. విమాన కనెక్టివిటీ లేని కొండ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో ఉడాన్ పథకం కింద చిన్నచిన్న విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లు నిర్మించే పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీని వల్ల అరకు, పాడేరుకు విమాన కనెక్టివిటీ ఏర్పాటు చేసే అవకాశం ఏపీకి లభించబోతోంది. ఇంత అద్బుతమైన బడ్జెట్ ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి శ్రీ సత్య సాయి జిల్లా బిజెపి అధ్యక్షుడు జిఎం శేఖర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments