
ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, మెహబూబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, అశ్వరావుపేట శాసన సభ్యులు జారే ఆదినారాయణ, పినపాక శాసనసభ్యులు పాయం వేంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య,కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, సత్తుపల్లి శాసన సభ్యులు మట్టా రాగామయి తదితరులు ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్నారు.ముఖ్యమంత్రి ముందుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బచ్చల నరసమ్మ, రమణల గృహాలను ప్రారంభించి వారితో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సభలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్వంత గృహం కల్పించేందుకు ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరయ్యాయని, అందులో 2 లక్షల 5 వేల 297 ఇండ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోందని వివరించారు.ఇప్పటికే 1 లక్ష 5 వేల లబ్ధిదారుల ఖాతాలలో నేరుగా ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయాన్ని జమ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు మొత్తం రూ. 5 లక్షలు నాలుగు విడతల్లో మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గృహాలు మంజూరైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ తర్వాత పది సంవత్సరాల పాటు ఆగిపోయిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం సన్నబియ్యం పంపిణీ పథకం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.నూతన గృహప్రవేశాల సందర్బంగా గ్రామంలో అడుగుపెట్టగానే చిరు జల్లులు కురవడం దేవుని ఆశీర్వాదాలుగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. బెండలపాడు గ్రామానికి మొత్తం 312 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి. గౌతమ్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటిడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాహుల్, ట్రైనింగ్ కలెక్టర్ సౌరభ్ శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారభద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామచర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….ఖమ్మం జిల్లా చైతన్యానికి మారుపేరు ఇది ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాదు..పేదల గూడెంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభ ఆనాడు పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇందిరాగాంధీ రోటీ, కప్డా ఔర్ మకాన్ నినాదం తీసుకున్నారు వైఎస్ హయాంలో పేదోడి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు పదేళ్లలో 25 లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానిది హనుమాండ్ల గుడి లేని గూడెం, గ్రామం ఉందేమో కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవు ఎన్నికల సమయంలో ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాం ఇందిరమ్మ రాజ్యంలో ఆ హామీని నెరవేరుస్తున్నాం పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని గృహ నిర్మాణ శాఖ బాధ్యత పొంగులేటి శ్రీనన్నకు ఇచ్చాం సరిగ్గా పని చేసే మంత్రి ఉండాలని ఆయనకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలు అప్పగించాం నా అంచనా తప్పలేదు.. ఆయన శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు ధరణిని బొందపెట్టి భూభారతిని తెచ్చినా.. పేదోడి సొంతింటి కలను నిజం చేసినా సమర్థవంతంగా చేశారు పేదోడి సొంతింటి కలను నిజం చేయడంకంటే సంతోషం మాకు ఇంకేం ఉంటుంది పేదరికం మాకు ఎక్స్ కర్షన్ కాదు.. అది మా జీవన విధానం పేదరికాన్ని పారద్రోలడమే మా ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షం పేదోళ్ల గుండెల్లో ఇందిరమ్మ స్థానం సంపాదించుకున్నారు రేషన్ కార్డులు ఇచ్చాం.. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం లక్ష కోట్లు దోచుకున్నాయన కుటుంబ సభ్యులు ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు బావ, బామ్మర్ది, అన్న చెల్లి ఇంటిల్లిపాది ఎవరికి వారు కత్తులు బల్లాలు తీసుకుని వీపులో పొడుచుకుంటున్నారు ఎంత సంపాదిస్తే ఏం లాభం.. దోపిడీకి సొమ్ము వాళ్ల కుటుంబంలో చిచ్చు పెట్టింది ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. వాళ్లు వాళ్లు కొట్టుకుని మన పేర్లు తీసుకున్నరు మేమేదో వాళ్ల వెనక, వీళ్ల వెనక ఉన్నామని అంటున్నారు 2023 లోనే ఆ కాల నాగును కట్టెతో కొట్టి చంపేశా..ఇప్పుడు ఆ చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బీఆరెస్ అనే కాలకూట విషం ఉన్న కాలనాగును ప్రజలు డిసెంబర్ 3, 2023 న బండరాయితో మోది బొంద పెట్టారు.మీ పంపకాల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గరకు వెళ్లండి తెగకపోతే కులపెద్ద దగ్గరికి పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాడి దగ్గరకు పోండి అంతే తప్ప మీ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని లాగకండి మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పని ఉంది.. సన్న బియ్యం ఇచ్చే పని ఉంది.మన తలరాతను మార్చేది విద్య ఒక్కటే..విద్య మాత్రమే మన జీవితాలను బాగుచేస్తుంది 20 వేల కోట్లు పాఠశాలల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాం 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏటీసీ ఏర్పాటు చేసే బాధ్యత నాది చదువుకోండి.. చదువుకు ఏం కావాలో నన్ను అడగండి ఎవరో సాయం చేయాలని ఎదురుచూసే స్థాయి నుంచి ఒకరికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి ఆ స్థాయికి ఎదగాలంటే చదువుకోవాలి కీలక శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి ఖమ్మం జిల్లా ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదు పదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది.. పేదోడి సొంతింటి కలను నిజం చేస్తుంది