
ఇక్కడ నుండి తరలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ స్పష్టం.
( పయనించే సూర్యుడు ఆగస్టు 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొన్ని చిన్న చిన్న సాకులు చూపిస్తూ కొందుర్గు మండల కేంద్రంలో ఉన్న గురుకుల బాలుర పాఠశాలను తరలించే కుట్రను మానుకోవాలని ప్రజాసంఘాలు గళమెత్తాయి. కొందుర్గు మండల కేంద్రంలో రోడ్డుకు అడ్డంగా బేటాయించి ఇక్కడ నుండి తరలించవద్దని నిరసన తెలిపారు.ఇప్పటికే విద్యలో చాలా వెనుకబడిపోయిందని, ఇక్కడి నుండి తమ ప్రాంతాలకు కాకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తే పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకొని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.ప్రజాసంఘాల నాయకులు, విద్యాసంస్థల పట్ల ఆసక్తి కలిగిన స్థానికులు మాట్లాడుతూ …స్వార్థపరులు సృష్టించిన చిన్న చిన్న సమస్యలను బూచిగా చూపించి గురుకుల బాలుర పాఠశాలను తరలించే ప్రయత్నం జరుగుతోంది. ఇది పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే వారి చదువుపై ప్రభావం పడుతుందని, బలహీన వర్గాల పిల్లలకు ఇది తీవ్ర అన్యాయం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యం విద్యను అందరికీ చేరవేయడం.కానీ ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఉన్న సౌకర్యాలను మరింత అభివృద్ధి పరచాలి కానీ పాఠశాలను తరలించడం అనవసరమని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ప్రజాసంఘాల ఐక్యత ఆధ్వర్యంలో రేపు కొందుర్గు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలను తరలించే కుట్రను తక్షణమే విరమించుకోవాలని, లేకపోతే ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాశ్ నాయక్ మాట్లాడుతూ….గురుకుల బాలుర పాఠశాలను ఇక్కడి నుండి తరలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ ప్రాంతం ముందే వెనుకబడింది. విద్యా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అధికారులే, విద్యను దూరప్రాంతాలకు తరలించడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గురుకుల బాలుర పాఠశాలను మండల కేంద్రంలోనే కొనసాగించాలంటూ ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శన్, నిరటి రాజు , శివ మణికంఠ, సంతోష్, ఫయాజ్, సంతోష్ నాయక్, రమేష్ శంకర్, గణేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు,
