
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 04: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరదిలోగల ఆశ్రమ పాఠశాల పేరూరునందు శుక్రవారం విద్యార్థిని, విద్యార్థులకు
వడదెబ్బ అంటే ఏమిటి? వడదెబ్బ ఎందుకు వస్తుంది ?వడదెబ్బ నివారణ చర్యలు ఏమిటి? వడ దెబ్బగురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంపై ప్రయోగాత్మకంగా చేయవలసిన ప్రథమ చికిత్స గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈయొక్క కార్యక్రమంలో వడదెబ్బయొక్క లక్షణాలు వివరించారు. ఎవరికైనా తలనొప్పి,జ్వరం,కళ్ళుతిరగడం,వాంతులు, విరేచానాలు, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, శ్వాస వేగంగా తీసుకోవడం, మూత్రం పసుపు రంగులో రావడంలాంటి మొదలగు లక్షణాలు ఉంటే వడదెబ్బ అని తెలియజేశారు.వెంటనే ప్రథమ చికిత్స తీసుకోవాల్సిందని తెలియజేశారు. అంతే కాకుండా వడదెబ్బ తగలకుండా చేయవలసినవి చేయకూడనివి పనులను గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఇఓ, వేణుగోపాలకృష్ణ, పిహెచ్ఎన్ సంగీత, ఎఎన్ఎం , శకుంతల,హెచ్ఎ, శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఆశా కార్యకర్త పాల్గొన్నారు.
