Monday, June 2, 2025
Homeఆంధ్రప్రదేశ్పొగాకు రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

పొగాకు రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Listen to this article

సులానగర్ పీ. హెచ్.సి వైద్యులు డాక్టర్ కందుల దినేష్

పయనించే సూర్యుడు మే 31 (పొనకంటి ఉపేందర్ రావు )


టేకులపల్లి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ముత్యాలపాడు క్రాస్ రోడ్ గ్రామంలో జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి గారు మాట్లాడుతూ పొగాకు కంపెనీలు వాటి ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు అందమైన రంగులతో కూడిన ప్యాకింగ్ లు తయారుచేసి ప్రజల్ని ఆకర్షించే విధంగా మార్కెట్ లో అందుబాటులో ఉంచుతున్నాయని ఈ అందమైన పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్ వెనక ఉన్న కంపెనీల ఉద్దేశాల్ని ప్రజలకి తెలపడానికి పొగాకు మెరిసే ఉత్పత్తులు -చీకటి ఉద్దేశాలుఅనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పొగాకు వాడకానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్య సిబ్బందిని ఉద్దేశించి అన్నారు బీడీ చుట్ట సిగరెట్ అంబర్ గుట్కా ఖైని జర్దాపాన్ మొదలైన పొగాకు ఉత్పత్తులను ఏ విధంగా తీసుకున్నా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్వర పేటిక క్యాన్సర్ నోటి క్యాన్సర్ ప్రేగుల క్యాన్సర్ కిడ్నీ గర్భసంచి క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్లతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ ఎముకలు బలహీనమవడం నోరు తెరుచుకోక లేకపోవడం నోటిలో మచ్చలు పుండ్లు రక్త నాళికల్లో పూడికలు రావడం రక్తం చిక్కబడడం రక్తనాళాలు కుంచించుకపోవడం తద్వారా గుండెపోటు సంతానం కలగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయని కాబట్టి ఈ పోగాకు మహమ్మారికి బానిసలు అయిన వారికి పోగాకు వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను వివరించి పొగాకు ఉత్పత్తుల వాడకానికి దూరం చేసి ఆరోగ్యకరమైన జీవితం గడిపేటట్లు చేయాలని కోరారు అలాగే బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం చట్టరీత్యా నేరమని వీటిని భారత ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిందని కాబట్టి పొగాకు వాడుక రహిత భారత సమాజ స్థాపన కొరకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కంచర్ల వెంకటేష్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్ నాగు బండి వెంకటేశ్వర్లు గుజ్జ విజయ కౌసల్య సింగ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు అమూల్య ఇంద్రజ హారిక శైలజ ధరణి ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments