
వాజేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు.
పయనించే సూర్యుడు: మార్చి01: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. వాజేడు: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి నికార్సయిన నాయకుడిగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీని వీడకుండా కరుడగట్టిన కాంగ్రెస్ వాదిగా ప్రజల కోసం కార్యకర్తల కోసం అనునిత్యం పార్టీ బలోపేతం కోసం కృషిచేసిన ఆదివాసి ముద్దుబిడ్డ పొదెం వీరయ్య కు ఎమ్మెల్యే కోటాలోఎమ్మెల్సీ పదవి ఇచ్చి గిరిజన శాఖ మంత్రిగా నియమించాలని వాజేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని విడవకుండా గత ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన కూడా పార్టీని విడవకుండా అనునిత్యం ప్రజలకు విశేష సేవలు అందించిన నాయకుడు పొదెం వీరయ్య అని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం గడిచిన ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పెద్దలు ఇకనైనా పొదెం వీరయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్ లో గిరిజన శాఖ మంత్రిగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈయొక్క సమావేశంలో సీనియర్ నాయకులు పూనెం రాంబాబు, వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బొల్లె డెనార్జున రావు, ములుగు జిల్లా ఎస్టీసెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు, సీనియర్ నాయకులు నల్లగాసి రమేష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
