
తిరువూరు మండలంలోని చింతలపాడు ఎరుకోపాడు గ్రామాలలో నిర్వహించడం జరిగింది. పయనించే సూర్యుడు జనవరి 5 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.వార్తా విశ్లేషణ. మండల వ్యవసాయ అధికారి పి పద్మ మాట్లాడుతూ అగ్రీ స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ నందు మండలంలోని రైతుల వివరాలను నమోదు చేసి రైతులకు డిజిటల్ ఫార్మర్ ఐడిని ఇవ్వవలసిందిగా రైతు సేవా కేంద్ర సిబ్బందికి సూచించడం జరిగింది..
రైతులకు ఆన్లైన్ గుర్తింపు నెంబర్ కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల గుర్తింపు కోసం ప్రత్యేక ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చిందిజనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రంలో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది..రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ వారు చేస్తున్నారు..ఫార్మర్ ఐడి కార్డు వలన ఉపయోగాలు.దీని ద్వారా ప్రతి రైతుకూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుంది..
పార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తుంది.ఇది దేశంలో రైతు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఈ గుర్తింపు కార్డుల ద్వారా వ్యవసాయ శాఖ వారు రైతులను అప్రమత్తం చేస్తారు.వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడుసమాచారం అందిస్తారు.వ్యవసాయ పథకాలను నేరుగా చేరవే స్తారు.పంట నష్టం, ప్రకృతి వైపరీత్యాలు, బీమా పరిహారంలో ఈ గుర్తింపు కార్డు ఎంతో ఉపయోగకరం కానుంది.కావున రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారుస్థానిక రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు..నమోదుకు కావలసిన పత్రాలు..ఆధార్ కార్డు, రైతు పొలం పాస్బుక్ లేదా 1 బి ఆధార్ తో లింక్ ఉన్న మొబైల్ నంబరుతో స్థానిక రైతు సేవా కేంద్రంలో ‘సంప్రదించాలి..ఆన్లైన్లో నమోదు తర్వాత రైతులకు 11 అంకెలతో కూడిన వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఇస్తారు..
ఈ కార్య్రమంలో వెటర్నరీ డాక్టర్ స్వప్న వ్యవసాయ విస్తరణ అధికారి జి. అరున్ కుమార్ రైతులు పాల్గొన్నారు.